Header Ads

test

ఒక్క కండువా - ఎన్ని ఉపయోగాలో

ఎడమ వైపు వేసుకుంటే శుభమ్ అని అర్ధం.
కుడివైపు వేసుకుంటే అశుభం అని అర్ధం.
రెండువైపులా వేసుకుంటే గౌరవ సూచకం.


ఒక్క కండువా - ఎన్ని ఉపయోగాలో
ఒక్క కండువా - ఎన్ని ఉపయోగాలో



నెత్తిమీద వేసుకుంటే దివాలా తీసినట్టు, లేదా విచారంగా ఉన్నట్టు 
తలకు చుట్టుకుంటే పాగా వేసేసినట్టు.
ముఖం చుట్టూ కట్టుకుంటే ఎండలో గానీ చలిలో గానీ రక్షణ కల్పించుకున్నట్టు.
నడుముకు చుట్టుకుంటే వీరత్వం ప్రదర్శిస్తున్నట్టు.

తలకు చుట్టుకుని చెవులను కవర్ చేసి గడ్డం దగ్గర ముడి వేస్తే చలి బారినుండి రక్షించుకున్నట్టు.
తలకు చుట్టుకుని వెనుక ముడి వేసి అంచులు వేలాడదీస్తే దుమ్మునుండి రక్షణ కల్పించుకున్నట్టు,
బస్సు లో సీటు పైన వేస్తే ..రిజర్వు చేసుకుంటున్నట్టు, 
 తలముక్కులను రెండూ కవర్ చేస్తే మీ ముఖం ఎవరూ గురుతు పట్టకూడదు అని భావిస్తున్నట్టు.
ముక్కును మాత్రం కవర్ చేస్తే చాలా అపరిశుభ్రమిన వాతావరణం లో మీరు ఉన్నట్టు.
కూర్చుని కండువా ఎడమ భుజం మీద వేసుకుని రెండు చేతులతో అంచులు పట్టి ఉంటే ఆశీస్సులు కోరుతూ అక్షంతలు అర్దిస్తున్నట్టు.
చేతిలో బ్యాగ్ లేకపోతే ఏదైనా వస్తువు మూటకట్టుకోడానికి కూడా ఉపయోగపడుతుంది.


No comments