చందమామ యాజమాన్యం ' చందమామను (1947-2000) అన్లైన్లో పెట్టడమే ఓ గొప్ప సేవ! యధాలాపంగా కధలు చదువుతుండగా 1947 నాటికధ చదివి ' నేను పుట్టిన సంవత్సరం నాటికధ' నాలో స్పందన కల్గించింది. చదివే ఊహ నాకు కలిగినప్పటినుండీ చందమామను మానాయనగారు కొనితెచ్చేవారు.పెరిగేకొద్దీ' కాసులు 'దాచుకుని చందమామ కొని చదివి నాతర్వాతి వారికి వివరిస్తూ, ఊరిస్తూ చెప్పిన జ్ఞాపకం నాకింకాఉంది.
చందమామకు ఫోటో వ్యాఖ్యలు పంపాలనీ, దాన్లో అచ్చులో నాపేరు చూచుకోవాలనే కోరిక అమితంగా ఉండేది. చందమామకు కధలు వ్రాయాలనీ, అచ్చులో పేరుతోపాటుగా ఆ నా కధకు ఎలాంటి బొమ్మలు వేస్తారో అనే ఊహతో పసితనమంతా గడచిపోయింది. ఆ ప్రయత్నం మాత్రం ఎందుకో జరగలేదు.అప్పట్లో పోస్టుకార్డు కొనడమే కష్టం, ఇహ కవరుకొని వ్రాసి పంపడమంటే మహా కష్టం.
చదువు, ఉపాధ్యాయ వృత్తిలో ఉద్యోగం, పల్లెల్లో పని చేయడం, నీతికధల పిరీయడ్లో పాత చందమామ కధలు పిల్లలకు మరికొంత సంభాషణలు, వివరణలు జోడించి ఆసక్తిదాయకంగా చెప్పడం కూడానాకింకా గుర్తుంది. పల్లెల్లో పని చేసేప్పుడు స్కూల్ లోని పిల్లలందరిచేతా నయాపైసలు కూడబెట్టించి, చందమామ పుస్తకాలు నెలనెలా నేనే కొని పట్టు కెళ్ళి చదివించడమూ, ఆపైన వాటిని ' స్కూల్ లైబ్రరీ'లో ఉంచడమూ కూడా నాకింకాగుర్తే!. స్కూల్లో చదువుకునేప్పుడు బోర్ కోట్టే పిరీయడ్లో నోట్బుక్లో చందమామ సంచిక పెట్టుకుని చదివిన రోజులూ గుర్తే. తోటి స్నేహితులు చూస్తే వారినీ చదువుకోమని చూపిన సంఘటన ఇప్పటికీ నవ్వుతెప్పిస్తుంది. చందమామ చేసినంత సాహిత్యసేవ ఇంతింతనరానిది. చిన్నతనంలోనే పిల్లలకు, చదవడాన్నీ, కధలపట్ల మమకారాన్నీ నేర్పినది మాత్రం చందమామే!
కాసులు దాచుకుని మరీ చందమామను కొని చదవడం, పల్లెల్లో పని చేసేప్పుడు స్కూల్లోని పిల్లలందరిచేతా నయాపైసలు కూడబెట్టించి, చందమామ పుస్తకాలు నెలనెలా నేనే కొని పట్టు కెళ్ళి చదివించడమూ, ఆపైన వాటిని' స్కూల్ లైబ్రరీ'లో ఉంచడమూ కూడా నాకింకాగుర్తే! చందమామలో పేరు చూసుకోవాలని ఉబలాటం...
స్కూల్లో చదువుకునేప్పుడు బోర్ కోట్టే పిరీయడ్లో నోట్బుక్లో చందమామ సంచిక పెట్టుకుని చదివిన రోజులూ... ఉపాధ్యాయుల జీతాలు చాలా తక్కువగా ఉన్న రోజుల్లో చందమామ కొనాలని ముందుగానే డబ్బు కూడబెట్టుకోవడం... వారంలో ఓరోజు 5 కిలోమీటర్ల దూరంలో ఉండే స్కూల్కు నడిచి ఆడబ్బుతో చందమామ వచ్చినరోజే కొని ఇంటికి వెళ్ళగానే ముందుగా ఫొటో వ్యాఖ్యలు చూసి సంబరపడటం.
కొరవ తదుపరి పుటలో చూడండి.
|