ipad/iphonetopBanner

కథలు

రాకాసిలోయ - 9

రచయిత: దాసరి సుబ్రహ్మణ్యం | 30th May, 2011


 

(రాజగురువు వెంట వచ్చిన బ్రహ్మపుర సైనికులు బ్రహ్మదండి మాంత్రికుడి కోసం, గుహ అంతా గాలించి, చివరకు కాలభైరవుడి విగ్రహం కిందవున్న బిలాన్ని కనుక్కున్నారు. ఎంత వెదికినా మాంత్రికుడి జాడ కనిపించక పోయేసరికి వాణ్ణి ఊదరపెట్టి బయిటికి రప్పించేందుకు రాజగురువు, బిల ద్వారాన్ని ఎండు పుల్లలతో మూయించి, వాటి మీద చమురుపోసి నిప్పు పెట్టించాడు.               తరవాత-)

 

చమురుతో బాగా తడిసిన ఎండుపుల్లలూ, ఆకులలములూ క్షణాల మీద నిప్పంటుకుని పెద్ద జ్వాలలతో బిల మార్గాన్ని కప్పివేసినై. చూస్తూండగానే నల్లని పొగ గుహనంతా ఆక్రమించింది. రాజగురువూ, సేనానీ, సైనికులూ గుహ బయిటికి పరిగెత్తారు.

‘‘గురువర్యా, మీరన్నట్టు మాంత్రికుడు బిలంలో ఎక్కడో దాక్కుని వుంటాడు. వాడు తప్పక ఈ మంటల్లో పడి ఆహుతి అవుతాడని నా భయం,’’ అన్నాడు సేనాని.
రాజగురువు గుహలో మరింతగా కమ్ముకుంటున్న పొగకేసి చూస్తూ, ‘‘వాడు అంత తేలిగ్గా చచ్చేరకం కాదు. వాడికి ఆ బిలంలో నుంచి బయటపడేందుకు మరోమార్గం తప్పకుండా వుంటుంది. వాడెక్కడో ఒక చోట కొండ మీదికి తేలుతాడు. సైనికుల్ని కాపుంచి, వాడు తల బయట పెట్టాగానే పట్టుకోమని ఆజ్ఞాపించు,’’ అన్నాడు.

రాజగురువు ఇలా మాట్లాడుతున్న సమయంలో బ్రహ్మదండి మాంత్రికుడు మచ్చల సింహం గుహ  వెనక భాగానికి చేరి, తన శిష్యుణ్ణి పిలుస్తున్నాడు. వాడు తన మంత్రదండంతో ఎన్నిసార్లు రాతి మీద కొట్టినా జయమల్లు దానికి అడ్డంగావున్న ఇనపకమ్మిని తొలిగించి, అతడికి మార్గం ఇవ్వలేదు.


సంబంధిత కథలు

Customer Help Nos
BannerBanner